HomeTelugu Trendingబంగార్రాజులో పాయల్ ఐటమ్‌ సాంగ్‌!

బంగార్రాజులో పాయల్ ఐటమ్‌ సాంగ్‌!

Payal Rajput as a item girl

టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ని తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగ్‌కి జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య, అఖిల్‌ కూడా నటించనున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక పాయల్‌ తెలుగులో వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’, రవితేజ సరసన ‘డిస్కోరాజా’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్‌’ అనే చిత్రంలో చేస్తోంది. పాయల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అప్పడప్పుడు హాట్ ఫొటో షూట్స్‌తో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu