HomeTelugu Trendingతండ్రి పుట్టినరోజు సందర్భంగా.. టైటిల్‌ ప్రకటించిన మహేష్‌..

తండ్రి పుట్టినరోజు సందర్భంగా.. టైటిల్‌ ప్రకటించిన మహేష్‌..

1 30టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరుశురామ్‌ డైరెక్షన్‌లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌ గురించి ఫిలిం నగర్ లో ఒక వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ చేసారంటూ వార్తలు వినిపించాయి. అయితే మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న అంటే ఈ రోజు ఈ సినిమా గురించి ప్రకటిస్తారు అని తెలిపారు. అయితే మహేష్ చెప్పినట్లుగానే తన తండ్రి పుట్టినరోజు ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇచ్చాడు. తన ట్విట్టర్లో తన తర్వాతి సినిమా పోస్టర్ విడుదల చేశాడు. అయితే అంతకు ముందు వచ్చినట్లే ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు తన మెడ మీద ”రూపాయి” ముద్ర వేసుకున్నాడు. అలాగే చెవికి ఫోగు తో మహేష్ లుక్ అదిరింది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!