HomeTelugu Trendingహాలిడే టిక్కెట్స్ క్యాన్సిల్‌ చేసుకున్న నాగార్జున.. కారణం ఇదేనా?

హాలిడే టిక్కెట్స్ క్యాన్సిల్‌ చేసుకున్న నాగార్జున.. కారణం ఇదేనా?

Nagarjuna cancel Maldives h
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమా రేపు (జనవరి14)న ప్రేక్షకుల ముంఉదకు రానుంది. ఈ సినిమా షూటింగ్‌లో నాగార్జున ఇప్పటి వరకూ చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాదు.. ఇటీవలే జరిగిన ‘బిగ్‌బాస్‌-7’ హోస్ట్‌గా వ్యవహరించాడు. దీంతో వరుస షూటింగ్‌లో గడిపిన నాగార్జున బ్రేక్‌ కోసం మాల్దీవ్స్‌కు టూర్ ప్లాన్‌ చేసుకున్నారట.

నా సామిరంగ, బిగ్‌బాస్‌ షూటింగ్‌లో నాన్‌ స్టాప్‌గా పని చేశాను. దీంతో ఈ సినిమా రిలీజ్‌ తరువాత రిలాక్స్‌ కావాలి అనుకుని టిక్కెట్స్‌ బుక్‌ చేసుకున్నాను. కానీ ఈ మధ్య టిక్కెట్స్‌ కాన్సిల్‌ చేశాను. ఎవరో ఏదో అనుకుంటారనో లేదా భయపడి ఈ పని చేయలేదు. మాల్దీవులు మంత్రులు మన దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కరెక్ట్‌ కాదు. అవి సత్సంబంధాల్ని దెబ్బతీసేలా ఉన్నాయి అని అన్నారు.

ఇలా మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో నాగార్జున కూడా చేరిపోయ్యారు. ఇప్పటికీ తనకు చాలా అలసటగా ఉంది అని, నా సామిరంగ మూవీ సక్సెస్‌ అయితే తన అలసట అంతా పోతుంది అన్నారు. ఇదే క్రమంలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించారు. ఈ సినిమాలో ఆయన ఓ పాటలను పాడాలి అనుకున్నారట. అయితే దానికోసం ఎక్కువ ప్రాక్టిస్‌ అవసరం. అంత టైమ్‌ లేకపోవడంతో ఆ పాట పాడలేక పోయాను. అన్నారు.

నా సామిరంగ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా లో నాగార్జునతో పాటు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ కూడా సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu