Homeతెలుగు వెర్షన్ప్చ్.. ఈ శునకానందం ఎన్నాళ్ళు జగన్ రెడ్డి ?

ప్చ్.. ఈ శునకానందం ఎన్నాళ్ళు జగన్ రెడ్డి ?

Pch.. How long ago is this Shunakanadam Jagan Reddyవైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముప్పేట దాడి పెరిగింది. నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు కూడా.. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి శత్రువులుగా మారిపోయారు. అంతేకాదు… నిన్న మొన్నటి వరకు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధిపత్య చలాయించిన నియోజకవర్గాల్లోనూ పరిణామాలు మారిపోయాయి. జగన్ రెడ్డికి కావాల్సింది ఇదే. తనను ఎదిరిస్తే.. ఎటు కాకుండా చేసేస్తా అని మిగిలిన నాయకులకు కోటంరెడ్డిని జగన్ ఓ ఉదాహరణగా చూపించాలి అనుకుంటున్నాడు. అందుకే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బిజినెస్ ల పైనా టార్గెట్ చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోటంరెడ్డిని సర్వ నాశనం చేయాలని జగన్ పట్టుబట్టారు. దీంతో ఇప్పుడు నిజంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో కి మారిపోయినట్టు అయింది.

అయితే, ఎంత ఎక్కువ కాలితే.. అంత బలమైన ఆయుధంగా మారతారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇప్పటికప్పుడు ఎలెక్షన్స్ వచ్చినా అక్కడ ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. సో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పోయేది ఏమీ లేదు. మహా అయితే, కొందరు దూరం అవుతారు. కొన్ని ఆస్తులు స్ట్రక్ అవుతాయి. అలాగే, కొన్ని దాడులు కూడా జరగొచ్చు. కానీ, ఇవన్నీ జరిగితే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్లో కోటంరెడ్డి ఇంకా పెద్ద హీరో అవుతాడు. వచ్చే ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకపోయినా కచ్చితంగా గెలుస్తాడు.

పాపం, ఆవేశంలో ఆవేదనలో ఉన్న జగన్ రెడ్డికి ఇవన్నీ అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని కోటంరెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి శునకానందం పొందుతున్నాడు. కానీ, ఈ శునకానందం ఎన్నాళ్ళు జగన్ రెడ్డి ?, అసలు జగన్ రెడ్డి నష్టపోయింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక్క ఎమ్యెల్యేని మాత్రమే కాదు. నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో చక్రం తిప్పగలిగే నాయకుడిని. పైగా నెల్లూరు ప్రస్తుత రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించగల నాయకుడ్ని.

నిజంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో భారీ బలగం ఉంది. అదే ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడానికి కారణం కానుంది. అంతేకాదు… అనిల్ కుమార్ యాదవ్ ను ఓడించేందుకు టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. అందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని అస్త్రంగా మార్చనున్నారు. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ కి టీడీపీ నెల్లూరు సిటీ(అంటే.. అనిల్ నియోజకవర్గం) నియోజకవర్గం టికెట్ ఇవ్వనున్నారు. ఇది అనిల్ వర్గంలో ఆందోళనకు దారితీస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విజయం దక్కించుకున్న అనిల్ విషయంలో అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో.. వైసీపీ ఆల్ రెడీ నెల్లూరులో ఇద్దరి ఎమేల్యేలను కోల్పోయినట్టే. మొత్తానికి ఒక్క కోటంరెడ్డితో నెల్లూరు టీడీపీ గుప్పిట్లోకి వచ్చినట్టు అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu