Homeతెలుగు వెర్షన్ప్చ్.. జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టిన పవన్

ప్చ్.. జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టిన పవన్

Pch.. Pawan who reversed Jagans strategy

ఏపీ ప్రజల ఆలోచనలను జగన్ రెడ్డి పసి కడుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే, అవకాశం ఉంటే… ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లిపోవాలన్న ఆతృతలో ఉన్నాడు మన మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఇప్పటి వరకూ అటు ఐ ప్యాక్, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాల మధ్యలో కలలు కంటూ వచ్చిన జలగ రెడ్డికి అసలు నిజాలు ఏమిటి ? అనేది చిన్నగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితి తనకు ఏ మాత్రం అనుకూలంగా లేదు అని క్లారిటీ వచ్చేసింది. కాకపోతే, తన పాలన పై ప్రజలు ఒక్కసారిగా ఎందుకు తిరగబడుతున్నారో జలగ రెడ్డికి ఇంకా అర్థం కాలేదు.

ఈ అయోమయ స్థితిలో నుంచి త్వరగా బయట పడాలి అంటే.. తాను త్వరగా ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అనే నిర్ణయానికి జలగ రెడ్డి వచ్చేశాడు. ఎవరు ఏం చెప్పినా వెళ్లి తీరాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఈ మధ్యలో మారిన పరిస్థితుల్ని మళ్లీ చక్కబెట్టుకునేందుకు సొంతంగా జగన్ రెడ్డే రంగంలోకి దిగాడు. నిజానికి గతంలో ఢిల్లీ వ్యవహారాలు ఎక్కువగా విజయసాయిరెడ్డి చూసేవారు. కానీ ఎందుకో ఈ మధ్య ఏ1 కి ఏ2 కి మధ్య ఏదో తేడా కొట్టింది. అప్పటి నుంచీ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టాడు జగన్. జగనే నేరుగా కేంద్రంతో మాట్లాడుకున్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నానని జగన్ రెడ్డి చెబితే… మీ ఇష్టం అని కేంద్ర పెద్దలు సమాధానం ఇచ్చారు. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో రాను రాను క్లిష్టంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా జగన్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనుకున్న విధంగా చేయలేక పోతున్నా అనే ఆలోచనల్లోకి జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. సో.. ముందస్తు ఎన్నికలు ఇక రెడీ. అందుకే, ఇప్పటి నుంచే జగన్ రెడ్డి తన రాజకీయాలను మొదలు పెట్టాడు. తన మీడియాతో విష ప్రచారాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా జనసేన – టీడీపీ మధ్య వ్యవహారం బాగాలేదు, పవన్ కి అన్యాయం చేస్తున్నారని పుకార్లు పుట్టిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కూడా రంగంలోకి దిగాడు. సోషల్ మీడియాలో జనసనపై జరుగుతున్న పొత్తుల మైండ్ గేమ్ విషయంలో పవన్ కల్యాణ్ క్యాడర్‌కు స్పష్టమైనసూచనలు చేశారు. ఇతర పార్టీల ట్రాప్‌లో పడకూడదని పవన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ రాజకీయ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన పై వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి, ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనకు జగన్ వచ్చాడు. ఐతే, ఏపీ ప్రజల్లారా జగన్ రెడ్డిని మళ్లీ సీఎం ని చేస్తే.. ఇక ఆ దేవుడు కూడా ఏపీని కాపాడలేడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu