HomeTelugu Trending'పెద్దకాపు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘పెద్దకాపు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

peddha kapu movie release d
శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పెద్దకాపు’. టైటిల్‌ పోస్టర్‌ నుంచి గ్లింప్స్‌ వరకు విడుదలైన ప్రతి అప్డేట్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.ఈ సినిమాతో మిర్యాల రవిందర్‌ రెడ్డి మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది.

కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్‌ 29న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ డేట్‌కి విడుదల కావాల్సిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ వాయిదా పడటంతో.. పలు సినిమాలు ఆ డేట్‌ని లాక్‌ చేసుకున్నాయి. అంటే.. ఇంచు మించు ఆ తేదీలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రామ్‌ పోతినేని స్కంద, కిరణ్ అబ్బవరం రూల్స్‌ రంజన్‌ రిలీజ్‌ పోటీ పడుతున్నాయి. అయితే ఇంకా స్కంద రిలీజ్‌ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు గనుక ఇప్పటి వరకైతే పెద కాపుకు రిస్క్‌ లేనట్టే.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1980 బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తుంది. ఆ టైమ్‌లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాని కాస్త రా కంటెంట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తుంది. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవస్తవ హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాను మిర్యాల రవిందర్‌ రెడ్డి నిర్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!