Homeపొలిటికల్బటన్ నొక్కుడు పథకాలా.. చాలు తుపుక్ అంటున్నారు జనం

బటన్ నొక్కుడు పథకాలా.. చాలు తుపుక్ అంటున్నారు జనం

JAGAN 1

జగన్ రెడ్డి పనులు, ఆలోచనలు చూస్తుంటే.. పక్కా తిక్కలోడే అనిపిస్తోంది. అయినా తిక్కలోడు తిరుణాల్లకెళితే .. ఎక్కా,,దిగా సరిపోయిందట! ఈ తింగరి దరిద్రం వ్యవహారం ఇలాగే ఉందని జనం పెదవి విరుస్తున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తయారు చేసిన పనికిమాలిన నవరత్నాల మ్యానిఫెస్టో పట్టుకుని అదే బైబిల్ ఖురాన్ భగవద్గీత అని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ దాన్నే పట్టుకుని వెలాడుతున్నాడు అంటే.. జగన్ రెడ్డి తిక్కలోడే కదా. ఆ రత్నాలు వర్కౌట్ కాదు అని పిల్లలు కూడా క్లాస్ లు పీకుతున్నారు. అయినా తింగరోడికి బలుపు వెలగలేదు. దీనికీ తోడు.. దిక్కుమాలిన నిర్ణయాలు ఒక్కటి. ఉదాహరణకు… సినిమా టికెట్ రేట్లను ఎందుకు తగ్గించారంటే.. పేదోడు సినిమా చూడొద్దా అన్నాడు. మరి ఈరోజు తిరుమలలో వసతి గృహాల రేట్లు ఎందుకు పెంచినట్టు ? అంటే సామాన్యుడికి దేవుడిని దూరం చేయడానికా జగన్ రెడ్డి ?, అధికారం చేతిలో ఉంది కాబట్టి అంతా నా ఇష్టం అంటే ఎలా? భక్తులను తనకు దూరం చేస్తే దేవుడు ఊరుకుంటాడా ?, ఇదే భయం బటన్ రెడ్డిలో రోజురోజుకు పెరుగుతూ పోతుంది.

అన్నిటికీ మించి బటన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పిందం ఏంటంటే… నిజమైన కార్యకర్తలను, అభిమానులను దూరం చేసుకోవడం. ఇప్పుడు జగన్ మీద జగన్ పాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఛాన్సులు సృష్టించుకుని మరీ చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు సైలెంట్ అయింది. పూర్తి బలహీనంగా మారింది. ప్రస్తుతం ఉన్న కాపీ పేస్ట్ Paytm బ్యాచ్ వలన పైసా ఉపయోగం ఉండదు లేదు వైసీపీ పార్టీకి. అదే 2014 ఎన్నికలకు ఉపయోగ పడిన లక్ష కోట్ల అవినీతి స్లోగన్ 2019కి వచ్చే సరికి పూర్తి నిరుపయోగం అయింది. ఏ టీడీపీ అభిమాని అయినా లక్ష కోట్లు అని మాట్లాడితే అధికారంలో ఉండి నిరూపించలేనప్పుడు మళ్ళీ లక్ష కోట్లు మాట్లాడుతుంటే జనం నవ్వారు. సేమ్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి కూడా అదే అయింది. 2019 ఎలక్షన్స్ ముందు వాడేసిన పవన్ మూడు పెళ్ళిళ్ళు, చంద్రబాబు వెన్నుపోటు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. హోదా సాధించడానికి అభివృధ్ధి చెయ్యడానికి పవన్ మూడు పెళ్ళిళ్ళు ఏం అడ్డం అని జనం మాట్లాడుతున్నారు.

వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు అని బాబు పై ఆరోపణలు ఉన్నా.. జగన్ కంటే ఎన్నో వేల రెట్లు గొప్పగా బాబు పాలించాడు అంటున్నారు ప్రజలు… కాబట్టి క్రియేటివిటీ లేని కాపీ పేస్ట్ బ్యాచ్ వలన ఆ పార్టీకి పెద్ద హాల్ ఏ తప్ప నో యూజ్… పోనీ జగన్ గురించి గొప్పగా ఎలివేషన్లు ఇవ్వటానికి జగన్ ఏమైనా గొప్పగా పాలిస్తున్నాడా అంటే ఎప్పుడూ అవే దిక్కుమాలిన బటన్ నొక్కుడు పథకాలు. బటన్ నొక్కి అకౌంట్స్ లో ఇంతమందికి డబ్బులు వేశాడు అంటే చాలు తుపుక్ అంటున్నారు జనం. కాబట్టి జగన్ చేసిన పనులేవీ జగన్ కి ఉపయోగ పడేలా లేవు. మొత్తానికి ప్రస్తుత వాస్తవ పరిస్థితులు చూస్తుంటే.. జగన్ రెడ్డి ఒట్టి పోయిన గొడ్డులా తయారయ్యాడు. అన్నిటికీ మించి తింగరి వెదవలా మిగిలేలా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!