HomeTelugu Trending'మగధీర' సీక్వెల్స్‌!

‘మగధీర’ సీక్వెల్స్‌!

Planning for Magadheera mov

మెగా పవర్‌ స్టార్‌ చరణ్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘మగధీర’ సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా సాగుతున్నాయని అంటున్నారు. ఇక మరోవైపు ఈ సీక్వెల్‌కు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నరామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని డైరెక్టర్ శంకర్‌తో ఒక మూవీ చేస్తారట. ఇంతలోపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తారని, ఆ రెండు సినిమాలు అయిపోగానే రాజమౌళి, రామ్ చరణ్ కలయికలో మగధీరకు సీక్వెల్‌గా మగధీర-2 రానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!