‘పీఎం నరేంద్రమోడీ’ ట్రైలర్‌

భారత ప్రధాని నరేంద్రమోడీ జీవితాధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్రమోడీ’ బయోపిక్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోడీ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. ‘ఓ సాధారణ ఛాయ్‌వాలా.. ఈ దేశ ప్రధాని అవుతాడా?’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. మోడీ బాల్యం, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలా చేరారు? వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. మోడీ ప్రధాని అయ్యాక పాకిస్థానీయులు భారత్‌పై చేస్తున్న దాడులను చూసి ఓర్వలేక..’ఇంకోసారి హిందుస్థాన్‌పై చెయ్యివేస్తే.. నరికేస్తా. ఇదే పాకిస్థాన్‌కు నా హెచ్చరిక’ అని ట్రైలర్‌ చివర్లో మోడీ(వివేక్‌) చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. యావత్‌ భారత్‌లో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.