HomeTelugu Newsకరోనా.. వరదలు వచ్చినా ఆగని పోలవరం

కరోనా.. వరదలు వచ్చినా ఆగని పోలవరం

సోమవారాన్ని పోలవరం చేశామన్నారు… రాసిపెట్టుకో 2018 లో పోలవరం ప్రాజెక్ట్ తో నీళ్లిస్తామని సవాళ్ళు విసిరారు… ఆయన ఇంజనీరింగ్ తెలివి చూసి కేంద్రమే బతిమాలాడి రాష్ట్రానికి ప్రాజెక్టును అప్పగించిందని డబ్బాలు కొట్టుకున్నారు… ప్రాజెక్ట్ లో తానే పెద్ద మేస్త్రి అయి రాష్ట్ర జీవనాడిని దగ్గరుండి కట్టిస్తున్నట్టుగా బిల్డప్ .. రోజోకో శంకుస్థాపనతో తన పచ్చమీడియాలో డప్పు వాయించుకున్నారు…. తీరా చూస్తే పోలవరం గత చంద్రబాబు హయాంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా చేశారు. ఇక ఇది చాలదన్నట్లు జనాలా చెవుల్లో పూలు పెట్టి పోలవరం పూర్తయిందని రండి అంటూ జనాలను బస్సుల్లో తరలించి తన పచ్చమీడయాతో భజనలు చేయించడం, ఎలక్షన్స్ ముందు పిల్లర్లు కూడా పూర్తి కాకుండానే ఒక ఇనుపరేకు ముక్కతీసుకెళ్ళి పిల్లర్ల మధ్యన నిలిపి గేట్లు పెట్టేశాం పోలవరం పూర్తయ్యిందన్నారు. ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు దేశ ప్రధాని ప్రధాని నరేంద్రమోఢీ సైతం చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటిఎంలా మార్చుకున్నారని విమర్శించడం, ప్రతిపక్షాలు సైతం పోలవరంలో జరుగుతున్న అవినీతి పై ఉద్యమాలు చేయడంతో బాబుగారి బాగోతం వెలుగు చూసింది. ఇంత హడావిడి చేసినా పోలవరంను పూర్తిచేయకుండానే ఇంజనీరింగ్ పద్దతులకు వ్యతిరేఖంగా నిర్మాణాలు చేపట్టి ముంపు ప్రాంత ప్రజలకు తీవ్రనష్టం కల్గించడమే కాకుండా 2019 వరదల వల్ల ప్రాజెక్టులో వరదనీరు నిలిచిపోవడం వల్ల పనులు ఆలస్యానికి కారణమయ్యారు చంద్రబాబు.

polavaram 1

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి వైఎస్సార్ సిపి అధికారంలోకి రావటంతో పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నఅవినీతి పై ప్రత్యేక దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ నిర్వహించి దాదాపు ఖజానాకు 700కోట్ల రూపాయలకు పైగా ఆదా చేశారు. రివర్స్ టెండరింగ్ లో పనులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్ద 2019 నవంబర్ లో పనులను ప్రారంభించింది. ఆ సంవత్సరం వచ్చిన భారీ వరదల వల్ల స్పిల్ వే,స్పిల్ ఛానెల్ లో నిలిచిన వరదనీటిని తోడి, ముందుగా పని చేయడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని పనులు మొదలు పెట్టింది. వరదల వల్ల దెబ్బతిన్నఅంతర్గత రహదారుల నిర్మాణం, స్పిల్ ఛానెల్ లో నిలిచిన దాదాపు 4టిఎంసిల వరద నీటిని తోడి పనులను వేగం చేసింది.

మేఘా సంస్ద పోలవరం పనులు చేపట్టే నాటికి స్పిల్ వే పియర్స్ ఎత్తు సగటున 28 మీటర్లు ఉంటే ఇప్పుడు సగటున 52 మీటర్లు పూర్తి చేసింది మేఘా. అదే విధంగా స్పిల్ వే పియర్స్ పై పెట్టాల్సిన 192గడ్డర్ల నిర్మాణం అనతికాలంలోనే పూర్తి చేయడమే కాకుండా దాదాపు 88 గడ్డర్లును స్పిల్ వే పియర్స్ పై అమర్చింది. అదే విధంగా 10 పియర్స్ పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250 మీటర్లు పూర్తి చేయడం జరిగింది. మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటు తో పాటు,షట్టరింగ్ వర్క్,స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. అదేవిధంగా గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా వాటి నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది. నిర్మాణం పూర్తి అయిన ట్రూనియన్ భీం ల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబందించిన ప్రిలిమినరీ పనులు కూడా జరుగుతున్నాయి. స్పిల్ వే లో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.

polavaram

అదేవిధంగా స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టితవ్వకం పనులు పూర్తి చేయడం జరిగింది. జూన్ నుండి స్పిల్ ఛానెల్ లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. ఈనెల 15నుండి మరలా వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించి ఈ సీజన్ లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించికుంటుంది. ఇంక గ్యాప్-1 ఢయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడా వేగం చేసింది.ఇప్పటికే కాలమ్స్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇంక గ్యాప్-3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తిచేయడం జరిగింది.ఇంక కేవలం కాంక్రీట్ నిర్మాణ పనులు మాత్రమే మిగిలాయి. అనుమతులు రాగానే ఈ పనులు కూడా త్వరిత గతిన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కీలకమైన 902కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్ మీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.

ఓవైపు వరదలు,మరో వైపు కరోనాతో వలస కూలీలు పనులు వదిలేసి సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో దాదాపు పనులు నిలిచిపోయి పరిస్దితి రావడంతో ఆయా రాష్ట్రాల నుండి ప్రత్యేక రైళ్ళు,బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను రప్పించి పోలవరం పనులును మళ్ళీ వేగం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద. అదే విథంగా ముందస్తు ప్రణాళికతో పనులు చేయడం వల్ల ఈఏడాది వచ్చిన వరదల వల్ల పనులు నిలిచిపోకుండా స్పిల్ వై పియర్స్ పై గడ్డర్లు ఏర్పాటు చేసి బ్రిడ్జి శ్లాబు నిర్మాణ పనులు చేసింది మేఘా సంస్ద.

polavaram 2

తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని భావించి గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. పోలవరం పనులు నిలిచిపోయాయి,17నెలల నుండి కనీసం తట్టెడు మట్టి తీయలేదు, బస్తాడు కాంక్రీట్ వేయలేదు, పవర్ ప్రాజెక్టును పండబెట్టారు, వీరి వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం అంటూ మెసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. గతంలో రాసిపెట్టికో జగన్ అంటూ సవాళ్ళు విసిరిన వారే ఇప్పుడు తమ భాగోతం బయటపడుతుందని నానాయాగీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రచార ఆర్భాటాలు లేకుండా ఇంజనీరింగ్ పద్దతుల్లో పనులు చేసుకుంటూ ప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఇంజనీర్లు రేయింభవళ్ళూ శ్రమిస్తున్నారు.అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పవర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోకుండా ప్రభత్వమే దగ్గరుండి పనులు నిర్వహిస్తూ అనుకున్న సమయానికే ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu