HomeTelugu Trendingహీరో సాయి ధరమ్‌ తేజ్‌పై కేసు నమోదు

హీరో సాయి ధరమ్‌ తేజ్‌పై కేసు నమోదు

Police file case on hero sa

రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్‌ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. సాయితేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ని స్వాధీనం చేసుకుని.. రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు.

మరోవైపు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఈ ఉదయం బులెటిన్‌ విడుదల చేశారు. సాయి తేజ్‌ని పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రిలో పరామర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu