HomeTelugu Trending75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ

75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ

3 17
74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది ఏపీకి చెందిన ఎర్రమట్టి మంగమ్మ. పిల్లలు లేని ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగిన.. ఏళ్లు గడిచినా వారికి పిల్లలు కలగలేదు.ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినా ఆ కోరిక అలానే ఉండిపోయింది.

మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి వైద్యులు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (IVF) పద్ధతిలో ప్రయత్నంచి విజయవంతం అయ్యారు.ప్రస్తుత లెక్కల ప్రకారం గతంలో భారతదేశంలో 72 సంవత్సరాల వయసులో ఒకామె పిల్లలకి జన్మనిచ్చింది.అప్పట్లో అది రికార్డు కాగా ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డలను కనడంతో ఆ రికార్డు చెరిగిపోయింది.

తాజాగా మంగాయమ్మ రికార్డు బ్రేక్ చేసింది రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ. తాజాగా ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. పిల్లలు లేని ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చినట్టు కింకార్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బిడ్డ 600 గ్రాముల బరువుందని, ప్రస్తుతం నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే 75 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే తొలి వృద్ధురాలిగా ఈ బామ్మ రికార్డులకెక్కింది. మొత్తానికి ఏపికి చెందిన ఎర్రమట్టి మంగమ్మ రికార్డు బద్దలైంold lady creates record, Rajasthan, Mother, Mangayamma record breaksది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu