ప్రముఖ జ్యువెలరీ సంస్థకు అంబాసిడర్‌గా సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇక సితార నెట్టింట్లో తన డ్యాన్స్‌ వీడియోలతో.. ఫొటోలతో తెగ సందడి చేస్తుంది. సితార ఇప్పుడు ప్రముఖ జ్యుయలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిపోయింది.

మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నో కంపెనీల ను ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గాను సైన్ చేసింది. అంతే కాకుండా ఇటీవల మూడు రోజుల పాటు ఒక రహస్య ప్రాంతంలో సదరు యాడ్ కు సంబంధించిన షూటింగ్ లో కూడా సితార పాల్గొన్నట్లుగా టాక్‌.

ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు అత్యున్నత టెక్నీషియన్స్ ఈ యాడ్ ని రూపొందించినట్లుగా సమాచారం. సితార చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా మరియు ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ డబ్బు సంపాదిస్తోంది.

ఈ డీల్ తో చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయ అని సితార మరోసారి నిరూపించుకుంది. మహేశ్ బాబు సైతం బాల నటుడిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates