HomeTelugu Trendingపింక్‌ రీమేక్‌లో పూజా హెగ్డే.. పవన్‌ కోసమా.. లేక

పింక్‌ రీమేక్‌లో పూజా హెగ్డే.. పవన్‌ కోసమా.. లేక

2 5హీరోయిన్‌ పూజా హెగ్డే కెరియర్ ఇప్పుడు మంచి జోరుమీద వుంది. వరుసగా ఆమెకి స్టార్ హీరోల జోడీగా అవకాశాలు దక్కుతున్నాయి. వరుస హిట్లు కూడా వచ్చి ఆమె ఖాతాలో పడిపోతున్నాయి. దాంతో తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే, తమిళ .. హిందీ భాషా చిత్రాలపై కూడా శ్రద్ధ పెడుతోంది.

ఈ నేపథ్యంలోనే బోనీకపూర్ తన తదుపరి చిత్రం కోసం పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం బోనీకపూర్ .. అజిత్ హీరోగా ‘వలిమై’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే దిల్ రాజుతో కలిసి పవన్ హీరోగా ‘పింక్’ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అటు అజిత్ జోడీ కోసం పూజా హెగ్డేను సంప్రదించారా? లేదంటే తెలుగులో ‘పింక్’ రీమేక్ కోసం సంప్రదింపులు చేస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!