HomeTelugu Trendingలేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో పూజా హెగ్డే!

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాతో పూజా హెగ్డే!

9 15

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది పూజా హెగ్డే. వరుస అవకాశాలతో, హిట్‌లు ఆమె మార్కెట్ ను ఒక రేంజ్ కి తీసుకెళుతున్నాయి. ఈ బుట్టబొమ్మ తాజాగా ప్రభాస్, అఖిల్ సినిమాల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా తాజాగా ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హను రాఘవపూడి వినిపించిన ఒక కథ పూజాకు నచిందట. అయితే డేట్స్ చూసుకుని ఆమె అధికారికంగా వెల్లడించాల్సి ఉందట. ఆమె సిగ్నల్‌ ఇస్తే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో టైమ్‌ పట్టదని అంటున్నారు. నయనతార .. అనుష్క .. సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. తమ సత్త చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆ వైపుగా అడుగులేస్తున్న ఈ భామ ఎంత వరుకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu