HomeTelugu Trendingపూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్

3 27
పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఈ బుట్టబొమ్మ తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్‌ టీమ్‌ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు చెప్పింది. ఇప్పటికే ఈ విషయమై తన డిజిటల్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు పూజా తెలిపింది. త్వరలోనే తన అకౌంట్ రెడీ అవుతుందని అప్పటివరకు తన ఇంస్టాగ్రామ్ లో వచ్చే పోస్ట్ లకు రియాక్ట్ అవ్వడాన్ని పూజ కోరింది.

కాగా, ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజ మరో ట్వీట్ చేసింది. తన డిజిటల్ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు చెప్పింది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించినట్లు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu