HomeTelugu Trendingఅఖిల్‌ సినిమా కోసం భారీగా డిమాండ్‌ చేసిన పూజా హెగ్డే

అఖిల్‌ సినిమా కోసం భారీగా డిమాండ్‌ చేసిన పూజా హెగ్డే

5 24అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారట. త్వరలోనే ఫస్ట్‌లుక్ తో టైటిల్ ను రివీల్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.

మరోపక్క, ఈ సినిమాలో హీరోయిన్‌ ఎంపిక జరిగిపోయిందంటూ రష్మిక మందన .. కైరా అద్వాని .. నివేదా పేతురాజ్ పేర్లు వినిపించాయి. కానీ తాజా గా అవేవి నిజం కాదనే విషయం స్పష్టమైపోయింది. తాజాగా తెరపైకి పూజా హెగ్డే పేరు వచ్చింది. హీరోయిన్‌ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించగా, ఆమె 3.5 కోట్లను డిమాండ్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పూజి జాయిన్ కానుందని సమాచారం. ఈ వార్తపై అధికరికంగా ప్రకటిన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu