పూరి తమ్ముడు విలన్ గా మారుతున్నాడు!

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ 143 సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘బంపర్ ఆఫర్’ సినిమా మాత్రమే తనకు హిట్
ఇచ్చింది. ప్రస్తుతం ‘అరకు రోడ్ లో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత
ఈ హీరో విలన్ గా మారబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ స్వయంగా
తమ్ముడ్ని విలన్ గా టర్న్ అవ్వమని చెప్పడం విశేషం. అంతేకాదు తన సినిమా ద్వారానే
తమ్ముడ్ని విలన్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ చేయబోయే
తదుపరి సినిమాలో సాయి రామ్ శంకర్ ను విలన్ గా తీసుకున్నాడు. ఆ పాత్రను ప్రత్యేకంగా
డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి హీరోగా ఉన్న సాయి రామ్ కు విలన్ గా మారడం ఎంతవరకు
కలిసొస్తుందో చూడాలి!