మణిరత్నం దర్శకత్వంలో నాని!

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చాలా మంది దర్శకనిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మిస్తోన్న ‘ఎంసిఏ’ సినిమాలో నాని నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే మరో సినిమా కమిట్ అయ్యాడు. అలానే హను రాఘవపూడితో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. తాజాగా లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నాని 
నటించబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘ఓకే బంగారం’ సినిమాకు నాని తన వాయిస్ ను అందించాడు. ఆ సమయంలో మణిరత్నం.. నానితో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇటీవల నానిని కలిసి కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా నాని తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అలానే మణిరత్నం కూడా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత నాని, మణిరత్నంల సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.