HomeTelugu Trendingఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం కన్నుమూత

ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం కన్నుమూత

Popular film critics kaushi
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. కౌశిక్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో తమిళనాట కౌశిక్‌కు మంచి పేరుంది. ఈయన చనిపోయే ఆరుగంటలకు ముందు కూడా ‘సీతారామం’ సినిమాకు సంబంధించిన ట్వీట్‌ చేశారు.

ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ను అందించడం, ఇంటర్వ్యూలతో కౌశిల్‌ సోషల్‌ మీడియాలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. కాగా కౌశిక్‌ మరణం పట్ల ప‌లువురు సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!