Homeతెలుగు Newsకేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి: పోసాని

కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి: పోసాని

5 11తెలంగాణకు చంద్రబాబు వచ్చినట్టుగానే కేసీఆర్‌ సైతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తాను దేవుణ్ని కోరిన మొదటి కోరిక ఇదేనని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో డబ్బు దొరకడం, పంచడాన్ని తొలి సారి చూశానన్నారు. ఎన్టీఆర్‌నే చంపిన చంద్రబాబుకు కేసీఆర్‌ ఓ లెక్కా అని అనుకుని తాను భయపడ్డానని చెప్పారు. ఒక్క బక్క కేసీఆర్ ను కొట్టడానికి బోలెడంతమంది వచ్చారని.. గద్దర్‌ కూడా వారితో కలవడం చూసి ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

‘ఎప్పుడూ జనాల్లో ఉండే చంద్రబాబు.. ఎమ్మార్వో వనజాక్షి చెప్పుతో కొడితే బాబు కళ్లుకు కనపడలేదా? అప్పుడు చంద్రబాబు తాగి ఎక్కడ నిద్రపోయారు? కేసీఆర్‌.. ఫామ్‌ హౌస్‌లో ఉన్నా.. మహిళలకు రక్షణ కల్పించారు’ అని పోసాని అన్నారు. ఎప్పుడూలేని విధంగా తెలంగాణలో కుల గజ్జిని రగిలిచారన్న ఆయన.. ఏపీలో ఉండే కమ్మవారు కూడా నిజాయితీ గల వారిని గెలిపించాలని కోరారు.

ఏపీ ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు ప్రచారం చేస్తే బాగుంటుందని పోసాని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ మగతనం గురించి అందరికీ తెలుసన్న పోసాని.. ఆయన చాలా మంది తాట తీశారని.. వాళ్ల నాన్నను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తాట కూడా తీసే రోషం ఉన్నవాడని పోసాని అన్నారు. ఇక.. తెలంగాణలో లోకేష్‌ ప్రచారానికి రాకపోవడం వల్లే ఆ పార్టీకి రెండు సీట్లయినా వచ్చాయని ఎద్దేవా చేశారు. 019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!