కార్తీతో సెట్స్ పై రకుల్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కార్తీ నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. చాలా కాలం గ్యాప్ తరువాత రకుల్ మళ్ళీ కోలీవుడ్ లో నటిస్తోన్న సినిమా ఇది. కార్తితో కలిసి రకుల్ నటించబోయే మొదటి సినిమా కూడా ఇది. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో ‘కాట్రువెలియుడై’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన కార్తీ ఇప్పుడు వినోద్ దర్శకత్వం వహిస్తోన్న ‘ధీరన్ అధికారం ఒండ్రు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ సినిమాలో కార్తీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే చెన్నైలో పది రోజుల పాటు షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను గుజరాత్ లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. గుజరాత్ కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో దాదాపు 41 రోజులు నిర్విరామంగా షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చనున్నారు.