HomeTelugu TrendingKalki 2898 AD: హాలీవుడ్‌ పై ప్రభాస్‌ దండయాత్ర!

Kalki 2898 AD: హాలీవుడ్‌ పై ప్రభాస్‌ దండయాత్ర!

Kalki 2898 AD

Kalki 2898 AD: ఇండియన్‌ సినిమా ముందుకు తీసుకువెళ్లేందుకు టెక్నీషియన్స్‌ వర్క్‌ చేస్తున్నారు. ఛాన్స్‌ ఉంటే హాలీవుడ్‌ని బద్దలు కొట్టాలి అనుకుంటున్నారు. కానీ వారందరి కంటే ముందున్నాడు ప్రభాస్‌. బాహుబలి-2 విడుదలైనప్పటి నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తరువాత వరుస పాన్‌ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్ఫిరిట్‌, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్‌ కాలేదు.

అయినా హిట్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ తనకున్న ఇమేజ్‌, స్టార్‌ డమ్‌తో ఇండియన్‌ సినిమాని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికప్పుడు బిగ్‌ స్ర్కీన్‌ రూపురేఖల్ని మార్చేందుకు ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ ఆధారంగా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో కమల్‌హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె ఇంకా పలువురు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు నటిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమా నుండి బుజ్జి టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుజ్జి అంటే ఈ మూవీలో ప్రభాస్‌ వాడే కారు. ఇది హాలీవుడ్‌ని కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది. ఓ టాలీవుడ్‌ మూవీనుండి ఈ రేంజ్‌లో అవుట్‌పుట్‌ని ఎవరూ ఎక్స్‌పర్ట్‌ చెయ్యలేదు.

రాజమౌళి సినిమా తరువాత ప్రభాస్‌కు తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం, భారీతనం ఉండేలా చేసుకోవడం అలవాటుగా మారింది. తనకున్నఇమేజ్‌, స్టార్‌ డమ్‌తో ఇండియన్‌ సినిమాని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్‌ ఏమి చేసినా సంచలనమే. పాన్‌ ఇండియాలోనూ హాట్‌ టాపికే. అయితే ఆయన ఆశించిన విజయం మాత్రం ఇంకా రాలేదు.

రాజమౌళి బాహుబలి మూవీకి ప్రభాస్‌ 5 సంవత్సరాలు కేటాయించాడు. ఆ తరువాత ఆ రేంజ్‌లో కల్కి సినిమాకు మూడేళ్లు డేట్స్‌ కేటాయించాడు ప్రభాస్‌. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ సారి కల్కితో బాహుబలి మూవీ మ్యాజిక్‌ రిపీట్‌ చేసి టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ రేంజ్ మూవీని ఇస్తాను అంటున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu