ప్రభాస్ ఫైట్ కోసం ముప్పై కోట్ల ఖర్చు!

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో
ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఆయన సుజీత్ దర్శకత్వంలో చేయబోయే
సినిమాలో ఒక్క ఫైట్ కోసం దాదాపు ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో
రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో
ప్రభాస్ ఆకాశంలో ఫైట్ చేసే సన్నివేశం ఉంటుందట. ఈ ఫైట్ ను కంపోజ్ చేయడానికి హాలీవుడ్
నుండి టెక్నీషియన్స్ ను, స్టంట్ మాస్టర్ ను రప్పించనున్నారని చెబుతున్నారు. ఈ ఒక్క ఫైట్
కోసం దాదాపు 30కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ఈ సినిమాలో పరినీతి చోప్రాను హీరోయిన్
గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
 
 
CLICK HERE!! For the aha Latest Updates