HomeTelugu Big Storiesతిరుపతిలో టీసీఎల్‌ కంపెనీకి చంద్రబాబు భూమిపూజ

తిరుపతిలో టీసీఎల్‌ కంపెనీకి చంద్రబాబు భూమిపూజ

10 16
తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గీర్వాణి, ఎంపీ జయదేవ్‌, టీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 2019 డిసెంబర్‌ నాటికి టీసీఎల్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరుకు అనేక కంపెనీలు రానున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు తెలిపారు. చిత్తూరులో సిలికాన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీ పెట్టుబడులకు అనుకూల ప్రదేశంగా మారిందని పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌లో ఉందన్నారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో టీసీఎల్ నిర్మాణం జరగనుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తిని ప్రారంభించబోతున్నారు. ఏడాదికి సుమారు 60 లక్షల టీవీలు తయారు చేసే టీసీఎల్ యూనిట్ ద్వారా.. దాదాపు 8వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న టీసీఎల్ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీసీఎల్ ఛైర్మన్ లీ డాంగ్ షెన్గ్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో సిలికాన్ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తెలిపారు. టీసీఎల్ రాకతో సుమారు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని బాబు పేర్కొన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా చేయడమే తమ
లక్ష్యమని పేర్కొన్నారు చంద్రబాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu