HomeTelugu Trendingఉగాది కానుకగా ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌!

ఉగాది కానుకగా ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌!

11 9
టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. భారీస్థాయిలో హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ సినిమాకి ‘ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏ టైటిల్ అనేది ఇంకా ఖరారు చేయలేదు. కొన్ని రోజుల్లో టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఉగాది రోజున విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే .. ఈ ఉగాదికి ప్రభాస్ అభిమానులకు మంచి గిఫ్టే ఇవ్వనుండన్న మాట. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu