HomeTelugu Trending‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

Prabhas released Adipurushయంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సినిమా ‘ఆదిపురుష్’ను ఈ రోజు (మంగళవారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్‌తో ‘తానాజీ’ వంటి హిస్టారికల్ మూవీని రూపొందించిన ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. అలాగే, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రామాయణం’ ఆధారంగా రూపొందించనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం 3డిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ టైటిల్ పోస్టర్‌ను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. తాజాగా టైటిల్ మోషన్‌ పోస్టర్‌ ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2021లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి 2022లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu