HomeTelugu Big Storiesట్విట్టర్‌లో ట్రైండ్‌ అవుతున్న 'సలార్‌' టీజర్‌

ట్విట్టర్‌లో ట్రైండ్‌ అవుతున్న ‘సలార్‌’ టీజర్‌

 

Salaar Teaser Review Prabhas is back and howపాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘సలార్’. భారీ అంచనాలు మథ్య ఈ రోజు సలార్ టీజర్ విడుదలైంది. ‘కేజీఎఫ్’ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ లోకి వెళ్తే.. పులి, సింహం, చిరుత, ఏనుగు చాలా ప్రమాదకరం కాని జురాసిక్ పార్క్ లో కాదు. అక్కడ ఒకడుంటాడు. అంటూ డైలాగ్ ఎలివేషన్ ఇవ్వడంతో ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కత్తితో విలన్ గ్యాంగ్ ని సంహరిస్తూ దూసుకుపోతున్న బిల్డ్ అప్ ఇచ్చారు. చివర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఎలివేట్ చేశారు.

ఈ టీజర్ ఇప్పుడు ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. టీజర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. ట్విట్టర్ ఇండియాలో టాప్ పొజిషన్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కూడా టాప్ 2 పొజిషన్ లో ట్రెండ్ అవుతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!