
Prabhas Summer Vacation Cost:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ జీవితశైలి గురించి వినడమే వింతగా ఉంటుంది కదా! సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఆయన్ను ఇండియాలో పట్టుకోవడం కష్టం. సమ్మర్ వచ్చిందంటే చాలు, ఫ్రెండ్స్‌తో కలిసి యూరప్ టూర్ అనేది ప్రభాస్ కు అలవాటు.
ఇప్పుడు మరోసారి ఆయన తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఇటలీకి వెళ్తూ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే.. ఈ ట్రిప్ ఖర్చు ఏకంగా రూ. 5 కోట్లు అంట!
ఇదేంటి అన్నా అనిపిస్తుందా? కానీ ఇది నిజం. ప్రభాస్‌కి ఇటలీలో సొంత ఇల్లు కూడా ఉందట. కాబట్టి స్టే ఖర్చులు ఈ రూ. 5 కోట్ల్లో లేవు. ఈ మొత్తం మొత్తం ఫస్ట్ క్లాస్ ట్రావెల్, లోకల్ ఫుడ్ ఎక్స్‌పీరియన్స్, షాపింగ్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే స్పెషల్ ప్రైవేట్ పార్టీలు వంటివి అన్నీ కలిపి వచ్చింది.
యూరప్ ట్రిప్స్ అంత చవకకాదు. ఓ మామూలు ఫ్యామిలీ 10 రోజుల ట్రిప్‌కి కూడా రూ. 15-20 లక్షలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు ప్రభాస్ లాంటి స్టార్, స్పెషల్ సదుపాయాలతో టూర్ అంటే ఖర్చు ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించొచ్చు.
అంతేగాక, ప్రభాస్‌కి బిజీ లైఫ్‌స్టైల్, షూటింగ్ ప్రెషర్‌కి రిలీఫ్ ఇవ్వడానికే ఇవి అవసరం. హాలిడేలో పూర్తిగా రిలాక్స్ అయ్యి మళ్లీ ఎనర్జీగా సెట్‌కి వెళ్తారు. ఇది ఆయనకు ఓ రిఫ్రెష్ మోడ్ లాంటిది.
ఇక ఇలా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తేనేంటి.. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ముందు ఇది చిన్న విషయం!
ALSO READ: Vishal Health Update: విశాల్ కి ఏమైంది.. తమిళనాడు ఈవెంట్లో స్టేజ్ పైనే కుప్పకూలిపోయిన హీరో..