
Vishal Hospitalized:
హీరో విశాల్ తమిళనాడులో జరిగిన ఒక ఈవెంట్లో.. ఉన్నట్టు ఉంది స్టేజ్ పైన పరిపోవడం ప్రస్తుతం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అసలు తమ హీరో ఆరోగ్యం ఏమవుతుంది అని వారు చింతిస్తున్నారు. అసలు విషయాలకు ఏమయింది.. ఎందుకలా పడిపోయారు అనే వివరాల్లోకి వెళితే..
Vishal Collapse on Stage
తమిళ స్టార్ హీరో విశాల్ ఉన్నట్టుంది ఒక ఈవెంట్లో స్టేజ్ పైన పడిపోవడం ఆయన అభిమానుల్లో కలకలం రేపుతోంది. ఈ సంఘటన మే 16వ తేదీన తమిళనాడులో జరగగా.. వెంటనే విషయాల్ని హాస్పిటల్కి తరలించారు.
ఈ మధ్య కాలంలో కొంత బలహీనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన గత చిత్రం మద గజ రాజా ప్రమోషన్లలో ఈ మార్పు బాగా కనిపించింది. ఇటీవల జరిగిన అనేక కార్యక్రమాలలో కూడా విశాల్ తీవ్రంగా అలసిపోయినట్లుగా కనిపించారు. తాజాగా విశాల్ ఆరోగ్యం పై అభిమానులకు మరింత నిరాశ ఎదురయ్యింది.
విశాల్ తమిళనాడులోని విల్లుపురంలో మే 11వ తేదీ జరిగిన జరిగిన.. ప్రముఖ “మిస్ కువాగం 2025” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా విశాల్ ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. కానీ, ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. స్టేజ్ పై ఈవెంట్లో పాల్గొంటున్న.. విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం విశాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ విషయంలో మరిన్ని వివరాలు త్వరలో అందగలిగే అవకాశం ఉంది. వేసవి తాపం కారణంగా ఆయనకు అలసట లేదా డీహైడ్రేషన్ వలన ఈ పరిస్థితే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Hero #Vishal participated in an event in Koovagam, Villupuram district, Tamil Nadu.
Vishal faints on stage and recovered after receiving immediate first aid
📸 ChotaNewsApp pic.twitter.com/gCbXllXTL2
— Indiansainma (@IndianSainma) May 12, 2025
అయితే గతంలో జరిగిన కొన్ని సినిమా ఈవెంట్స్ లో విశాల్ చాలా కొంచెం ఓణుకుతూ కూడా కనిపించారు. ముఖ్యంగా ఆయన చేతుల్లో శక్తి లేకపోవడం ఆయన మైక్ పట్టుకున్నప్పుడు ఎంతోమంది గమనించారు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ఎక్కువ బరువు తగ్గిపోయారు విషయాలు. దీంతో అప్పట్లోనే ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉందని అందరు అనుకున్నారు. కానీ ఆయన సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించాక విషయాలు మామూలుగానే కనిపించాడు. అంతేకాకుండా తనకు జ్వరం రావడం వల్ల కొద్ది రోజులు అలా అయిపోయానని చెప్పుకొచ్చారు.
దాంతో ఇక విషయాలు మళ్లీ తిరిగి మామూలుగా అయిపోతారని.. ఆయన అభిమానులు భావించారు. కానీ ఈ సంఘటన జరిగి కొన్ని నెలలు కాకముందే.. విశాల్ కి ఇలాంటి మరో సంఘటన ఎదురు కావడంతో అభిమానుల్లో కొంచెం నిరాశ నెలకొంది. ఆయన పూర్తిగా కోలుకోవాలని తమిళనాడులో ఆయన అభిమాన సంఘాలు ప్రార్థిస్తున్నారు.
ALSO READ: OTT లో web సిరీస్ సీక్వెల్ కోసం Shahid Kapoor రెమ్యూనరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే