ప్రభుదేవా మైడియర్ భూతం

ప్రభు దేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మై డియర్ భూతం’. డిఫరెంట్ కథతో కిడ్స్ ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఎన్. రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్‌‌తో సాగిపోతున్న ఈ సాంగ్ లో ప్రభుదేవా తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటను అరవింద్ అన్నెస్ట్ పాడగా.. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి లిరిక్స్ అందిచారు. రాజేష్, డి. ఇమ్మాన్ అందించిన బాణీలు అందించారు. ఈ పాట సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.

CLICK HERE!! For the aha Latest Updates