HomeTelugu Newsభయపెడుతున్న ప్రభుదేవ లుక్‌..

భయపెడుతున్న ప్రభుదేవ లుక్‌..

10 13
కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌, నటుడిగా సత్తా చాటుతున్నాడు ప్రభుదేవ. దర్శకుడిగా బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుంటున్నారు ప్రభుదేవా. ఇటీవల సల్మాన్ ఖాన్ తో ‘దబాంగ్ 3’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఆతరువాత ‘స్ట్రీట్ డాన్సర్ 3’ లోను అలరించారు ప్రభుదేవా. ఇక తాజాగా ‘బఘీర’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ‘బఘీర’ అనే టైటిల్‌తో తన 55వ చిత్రం చేస్తున్నారు ప్రభుదేవా. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రభుదేవ లుక్ ఫ్యాన్స్‌కి థ్రిల్ కలిగిస్తుంది. డిఫరెంట్ కళ్ళద్దాలతో ప్రభుదేవా లుక్ భయపెట్టేలా ఉంది, పైగా గుండుతో కనిపించరు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందట. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చెయ్యాడాని సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu