ఎస్వీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్!

తెలుగు సినీ మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి విలక్షణమైన పాత్రలో అయినా నటించి మెప్పించగల ధిట్ట. ఇప్పుడు ఆ మహానటుడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రకాష్ రాజ్. దర్శకుడు నాగశ్విన్ ‘సావిత్రి’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా గురించి ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సమంత మరో కీలకమైన పాత్రలో కనిపించనుంది. అయితే కథలో భాగంగా ఎస్వీ రంగారావుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ పాత్ర కోసం నాగశ్విన్ చాలా మందిని పరిశీలించిన అనంతరం ప్రకాష్ రాజ్ అయితే బావుంటుందని ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రకాష్ రాజ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కు జంటగా జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో.. చూడాలి!