ప్రేమమ్ డైరెక్టర్ తో మాస్ మహారాజ..?

బెంగాల్ టైగర్ సినిమా తరువాత రవితేజ ఇప్పటివరకు మరొక సినిమా రిలీజ్ చేయలేదు.
మిగిలిన హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉంటే రవితేజ మాత్రం సంవత్సర కాలంగా
ఖాళీగా ఉంటున్నారు. అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వడం, స్టోరీలు సెట్ కాకపోవడంతో
సైలెంట్ అయిపోయాడు. ఈ క్రమంలో ఆయన ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు
తెలుస్తోంది. కార్తికేయ, ప్రేమమ్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు చందు మొండేటి
దర్శకత్వంలో నటించడానికి రవితేజ రెడీ అవుతున్నట్లు సమాచారం. చందు చెప్పిన లైన్
నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ గానం. ప్రస్తుతం ఈ సినిమాకు
సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్
మీదకు వెళ్లనుందని అంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates