సావిత్రిలో ‘వివాహ భోజనంబు’ సాంగ్!

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారణంగా దర్శకుడు నాగశ్విన్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సమంత మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రల కోసం జూనియర్ ఎన్టీఆర్, చైతులను సంప్రదిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ‘మాయాబజార్’ మూవీ ఎపిసోడ్ కూడా ఉంటుందట.

ఈ సినిమాలో ఫేమస్ అయిన వివాహ భోజనంబు పాటను ఇప్పటికీ అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. ఆ
పాటలో ఎస్వీఆర్ అధ్బుత నటనను కనబరిచారు. ఇప్పుడు ఆ పాటను సావిత్రి బయోపిక్ లో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు.

ఇప్పటి టెక్నాలజీను ఉపయోగించి మరింత అధ్బుతంగా పాటను చిత్రీకరించనున్నారు. అదే గనుక జరిగితే సినిమాలో ఇదొక హైలైట్ ఎలిమెంట్ కావడం ఖాయం.