HomeTelugu Newsప్రేమతో మీ కార్తిక్!

ప్రేమతో మీ కార్తిక్!

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాతలు మాట్లాడుతూ.. ”కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు దర్శకుడు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం. భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. కేరళ లోని వాగమన్, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్ల్ లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్ చేయని అందమైన లొకేషన్స్ లో షూట్ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!