HomeTelugu Trending'ప్రెజర్‌ కుక్కర్' టీజర్‌

‘ప్రెజర్‌ కుక్కర్’ టీజర్‌

9 15‘అమెరికా ఎప్పుడు పోతావురా?’ అని ఒక్కటే ప్రెజర్‌ అంటున్నారు యువ హీరో సాయి రోనక్‌. ఆయన నటించిన సినిమా ‘ప్రెజర్‌ కుక్కర్’. సుజాయ్‌, సుశీల్‌ దర్శకులు. రాహుల్‌ రామకృష్ణ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కట్‌ చేశారు. దాన్ని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. అమెరికా వెళ్లాలని హీరోను ఆయన తండ్రి ఒత్తిడి చేస్తూ ఉన్నారు.

‘అమెరికాలో ఎందుకు చదవాలి అనుకుంటున్నావు?’ అని అడిగితే.. ‘అది నా తండ్రి డ్రీమ్‌’ అని హీరో చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది. ‘అమెరికాకు పోవడంలో అంత మజాక్‌ లేదు అంకుల్‌..? ఇక్కడే హైదరాబాద్‌లో వీడు ఏదైనా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తే బాగుంటుంది కదా..’ అని రాహుల్‌ రామకృష్ణ చెబుతూ కనిపించారు. ‘నా లాంటి వాడికి.. అమెరికా ఎప్పుడు పోతావురా? అని ఒక్కటే ప్రెజర్‌’ అని హీరో తన బాధ చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu