Pushpa 2 release date:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రం ప్రీ-రిజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 23న విడుదలకు సిద్ధమవుతోంది. అంకిత్ కొయ్యా, రమ్య పసుపులేటి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. “నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. మామూలుగా ప్రజలు హీరోల అభిమానులుగా మారుతారు. కానీ నేను నా అభిమానులను చూసి హీరోనయ్యాను,” అని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అల్లు అర్జున్.
తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టిన అల్లు అర్జున్ ఇకపై తన సినిమాల మధ్య సమయాన్ని ఎక్కువగా ఉండనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని అన్నారు.
ఇక Pushpa 2 గురించి కూడా మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సీక్వెన్స్ గురించి ఇప్పటివరకు తన కెరియర్ లో తను చేసిన క్లైమాక్స్‌లలో చాలా కష్టమైనది అని అన్నారు. “పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం ఫిక్స్. అసలు తగ్గేదేలే,” అంటూ అల్లు అర్జున్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచారు.
సుకుమార్ వచ్చి ఇంకా గట్టిగా చెప్పమనడంతో అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ మ్యానరిజం తో చెప్పారు. “మా డైరెక్టర్ నన్ను ఇలాగే చెక్కుతారు. సినిమాని కూడా అలానే చెక్కారు” అని ఇన్ డైరెక్ట్ గా సుక్కు వల్లే సినిమా లేట్ అయింది అన్నట్టు చెప్పారు.