HomeTelugu Trendingతనలోని మరో టాలెంట్ బయటపెట్టిన మలయాళ భామ

తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన మలయాళ భామ

4 23మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటోంది. కన్నుకొట్టి కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ భామ ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది. ఆమెలో మంచి నటనే కాదు గాయని కూడా ఉందంటోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఓ మలయాళ సినిమా కోసం ప్రియావారియర్ తొలిసారి పాట పాడింది. గాయకుడు నరేశ్‌ అయ్యర్‌తో కలిసి ఆమె ఈ పాటను ఆలపించారు. కైలాష్‌ మేనన్‌ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీరేఖ భాస్కరన్‌ సాహిత్యం సమకూర్చారు. ఈ పాటకు సంబంధించిన టీజర్‌ను ప్రియా వారియర్‌ సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. “నా తొలి ప్రయత్నాన్ని మెచ్చుకున్న మీకంతా నా ధన్యవాదాలు”అని
ఆనందం వ్యక్తం చేసింది.

నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రంగ్‌దే’ సినిమాలో ప్రియా వారియర్‌ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రియా వారియర్‌ కూడా హజరయింది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మరోపక్క ప్రియా వారియర్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా “శ్రీదేవి బంగ్లా” విడుదలకు సిద్ధమౌతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu