HomeTelugu Trending'నారప్ప' ప్రియమణి ఫస్ట్‌లుక్‌.. వైరల్‌

‘నారప్ప’ ప్రియమణి ఫస్ట్‌లుక్‌.. వైరల్‌

5 2
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినబోతున్న తాజా చిత్రం ‘నారప్ప’. కోలీవుడ్‌లో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ఇది రూపొందుతుంది. తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా ద్వారా ప్రియమణి టాలీవుడ్‌ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈరోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ప్రియమణి ఫస్ట్‌లుక్ పోస్టర్ ను ‘నారప్ప’ టీమ్ ఈరోజు విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu