భర్త నిక్‌పై అభిమాని లోదుస్తులు విసిరితే.. గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్‌

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాల్లో లోదుస్తులు ఊపుతూ అందరికీ చూపించడం కలకలం రేపింది. శనివారం ప్రియాంక భర్త నిక్ జోనాస్, ఆయన సోదరుడు కెవిన్ నిర్వహించిన… కాన్సర్ట్‌కి మొదటిసారి వెళ్లిన ఆమె ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ సందడిలో ఎవరో మహిళా అభిమాని… జోనాస్ బ్రదర్స్‌పై తన బ్రాని విసిరేశారు. అది వెళ్లి మ్యుజీషియన్స్‌పై పడింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ప్రియాంక చోప్రా… ఆ బ్రాని తీసింది. దాన్ని అందరికీ చూపిస్తూ… గాల్లో ఊపుతూ… నవ్వుతూ… ఫన్ క్రియేట్ చేసింది. సాధారణంగా సాటి మహిళ ఎవరైనా తన భర్తపై బ్రా విసిరితే భార్య ఎవరైనా చూస్తూ ఊరుకోరు. ప్రియాంక మాత్రం దాన్ని కూడా ఎంజాయ్ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అయితే బ్రా ఎవరు విసిరిందీ తెలియలేదు. కానీ ఈ సంఘటన మాత్రం వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫొటో విపరీతంగా షేర్ అవుతోంది. కాన్సర్ట్ గురించి కంటే ఈ విషయంపైనే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు.ప్రియాంకా చోప్రా చర్యను కొందరు తప్పుపడుతున్నారు కూడా. భారతీయ విలువల్ని ఆమె మంటగలుపుతున్నారనీ,… సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.