HomeTelugu Newsనిక్ బర్త్‌డే సందర్భంగా వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక

నిక్ బర్త్‌డే సందర్భంగా వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక

13 9
హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గతేడాది వివాహం చేసుకున్నప్పటి నుంచీ ఈ జంట ఏం చేసినా వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రియాంక భర్త నిక్‌ బర్త్‌ డే సందర్భంగా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రియాంక పెళ్లయిన తర్వాత నిక్‌ మొదటి బర్త్‌ డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. గతంలో వారు సరదాగా, ఆనందంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫోటోలన్నింటిని వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

13a 1

ఈ వీడియోకి.. నీతో ఉండే ప్రతి రోజు ఓ కొత్త అనుభూతిని పొందుతాను.. నువ్వు నా జీవితానికి వెలుగువి, ప్రపంచంలోని అన్ని ఆనందాలకు నువ్వు అర్హుడివి నిక్‌, హ్యాపీ బర్త్‌ డే మై జాన్‌.. అంటూ హృదయాన్ని తాకేలా క్యాప్షన్‌తో షేర్‌ చేసింది. ప్రియాంక, నిక్‌ జంట కలిసి సరదాగా వంట చేస్తున్న క్లిప్స్‌, కొన్ని ప్రైవేట్‌ కార్యక్రమాల్లో వారు చేసిన అల్లరి ఫోటోలు, ప్రియాంక బర్త్‌ డేలో సందడి చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!