ఫ్యూచర్ లో వెబ్ సిరీస్ చేస్తాడట!

దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయడానికి ఎక్కువ రోజులు టైమ్ తీసుకోరు. చాలా తొందరగా సినిమాలు చేస్తుంటారు. అది స్టార్ హీరోతో అయినా.. చిన్న హీరోతో అయినా.. అదే జోరు చూపిస్తుంటారు. పూరికి ఒక కథ రాసుకోవడానికి ఒకరోజు సరిపోతుందట. ఒక రోజు తీరిక దొరికితే పూర్తి కథను సిద్ధం చేస్తానని అంటున్నాడు. అందుకే వచ్చే పదేళ్ళకు సరిపడే కథలు ఆయన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు.

కుదిరినంత వరకు సినిమాలు చేస్తానని, ఆ తరువాత వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో సినిమా సిస్టమ్ మొత్తం మారిపోతుందని అంతా.. వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపే రోజు వస్తుందని తాను కూడా ఆ దిశగా వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మరి వెబ్ సిరీస్ ను చేయడంలో ఇంకెంత స్పీడ్ ను చూపిస్తారో.. చూడాలి!