HomeTelugu Big Storiesపూరీ.. నువ్వు అచ్చం మైక్‌ టైసన్‌లానే ఉన్నావ్‌: రామ్‌ గోపాల్‌ వర్మ

పూరీ.. నువ్వు అచ్చం మైక్‌ టైసన్‌లానే ఉన్నావ్‌: రామ్‌ గోపాల్‌ వర్మ

RGV comments on liger team
రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్‌ మంగళవారం లాస్‌ వెగాస్‌లో ప్రారంభమైంది. విజయ్-మైక్‌టైసన్‌లపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం కొన్ని ఫొటోలతో షేర్‌ చేసుకుంది. మైక్‌ టైసన్‌తో షూట్‌ ఎంతో సరదాగా ఉందని టీమ్‌ తెలిపింది.

లైగర్‌ చిత్రం బృందం షేర్‌ చేసిన ఫొటోలపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అచ్చం మైక్‌టైసన్‌ల కఠినంగా ఉ‍న్నాడని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. ‘వన్‌ అండ్‌ ఓన్లీ మైక్‌ టైసన్‌తో లైగర్‌ ఫ్యామిలీ’ అని క్యాప్షన్‌ ఇచ‍్చారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా లైగర్‌ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌ న్యూలుక్‌లో పొడవాటి జుత్తుతో కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటించనుంది. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమాని చార్మితోపాటు కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu