అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒకే తెరపై..?

ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో ఇప్పరివరకు క్లారిటీ రాలేదు కానీ ఆయన ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ లో ఇటీవలే మల్టీస్టారర్ ల సినిమాలు రావడం మొదలయ్యాయి. కల్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ కూడా ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఇప్పుడు మరో మెగా, నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతోందని టాక్. అది కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమా కావడం విశేషం. ఈ కాంబో గనుక సెట్స్ పైకి వెళ్తే అభిమానులకు పండగే.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.

పూరీ గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో సినిమాలు రూపొందించారు. వారి మధ్య మంచి ర్యాపో ఉంది. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను హీరోలకు వినిపించాడని టాక్. మరి ఈ భారీ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారో.. చూడాలి!