HomeTelugu NewsPushpa vs Game Changer vs Devara: ఏ సాంగ్‌ ట్రెండింగ్‌లో ఉందంటే?

Pushpa vs Game Changer vs Devara: ఏ సాంగ్‌ ట్రెండింగ్‌లో ఉందంటే?

Pushpa-Game Changer- DevaraPushpa vs Game Changer vs Devara: త్వరలో మూడు పాన్‌ ఇండియా సినిమా విడుదల కాబోతున్నాయి. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ష 2, రామ్‌ చరణ్‌.. గేమ్ ఛేంజ‌ర్‌, ఎన్టీఆర్‌ దేవ‌ర. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈక్రమంలో వరుస ప్రమోషన్స్‌ చేస్తున్నారు మేకర్స్‌.

ఇప్పటికే ఈ మూడు సినిమాల నుంచి ఒకొక్క పాట విడుద‌లైంది. ముందుగా రామ్ చ‌ర‌ణ్ ‘జ‌ర‌గండి.. జ‌ర‌గండి’ పాట విడుదలైంది. త‌మ‌న్ సంగీత అందించిన ఈ పాట ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ‘జాబిల‌మ్మ జాకెట్ వేసుకొని’ అనేది మ‌రింత ట్రోల్ అయ్యింది. త‌మ‌న్ పాట‌లో కొత్తదనం లేద‌ని పెద‌వి విరిచారు. ఇప్పటి వరకు 1.7 మిలియన్ల వ్యూసే వచ్చాయి

‘పుష్ష 2’ నుంచి టైటిల్ సాంగ్‌ వ‌చ్చింది. ఈ పాట బన్నీ ఫ్యాన్స్‌ని ఊపేసింది. సోష‌ల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతోంది. రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో బ‌న్నీ స్టెప్పులు కూడా హైలెట్‌గా మారాయి. ‘పుష్ప పుష్ప’ సాంగ్ విడుదలైన 6 భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా చూసిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా అక్టోబర్ 10 దసరా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ఫస్ట్‌ సాంగ్‌.. ఫియర్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘దూకే ధైర్యంగా జాగ్రత్త..దేవర ముందు నువ్వెంత’ అంటూ సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు,నెటిజన్స్ కు విపరీతంగా నచ్చింది. అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన ఫియర్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఫియర్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ఇప్పటిరకు 50 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించి టాప్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu