అసిస్టెంట్ ను కొట్టిన బాలయ్య!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన సహనాన్ని కోల్పోయాడు. పబ్లిక్ ఈవెంట్ అని కూడా చూడకుండా తన అసిస్టెంట్ పై చేయి చేసుకున్నాడు. నిన్న ‘పైసా వసూల్’ గుమ్మడికాయ ఫంక్షన్ లో పాల్గొన్న బాలయ్య ఈరోజు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన కాలికి ఉన్న షూ తీయమని అసిస్టెంట్ ను పిలవగా అతడు కాస్త ఆలస్యంగా స్పందించాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చి అసిస్టెంట్ తలపై ఒక్కటి కొట్టారు. ర్శకుడు కెఎస్ రవికుమార్ తో పాటు చాలా మంది చూస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

అతడిని కొట్టిన బాలయ్య ఏదీ జరగనట్లుగా తన సంభాషణను కొనసాగించడం వీడియోలో కనిపించింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. బాలయ్యకు సంబంధించి ఇలాంటి వీడియోలు బయటకు రావడం కొత్తేమీ కాదు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడైనా.. బాలయ్య తన ఆగ్రహాన్ని కాస్త తగ్గించుకునే మంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.