HomeTelugu Newsరవితేజ సినిమా రాశిఖన్నా ఐటమ్‌ సాంగ్‌!

రవితేజ సినిమా రాశిఖన్నా ఐటమ్‌ సాంగ్‌!

11 4
మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ మూవీని సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్‌లో కనిపించనున్నడనేది టాక్. ఇక ఇందులో హీరోయిన్లుగా నబా నటేష్‌, నిధి అగర్వాల్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఇందులో స్పెషల్ పాటలో హీరోయిన్‌ రాశిఖన్నా మెరవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి‌. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? స్పెషల్ సాంగ్‌కు రాశి ఓకే చెప్తుందా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా రవితేజ హీరోగా నటించిన బెంగాల్‌ టైగర్‌, టచ్‌ చేసి చూడు చిత్రాల్లో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu