HomeTelugu Trendingరాధ కుమార్తె కార్తీక పెళ్లి ఫొటోలు వైరల్‌

రాధ కుమార్తె కార్తీక పెళ్లి ఫొటోలు వైరల్‌

radha daughter karthika 2

అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ రాధ కుమార్తె కార్తీక వివాహం జరిగింది. కేరళలో కార్తీక వివాహం రోహిత్ మీనన్‌ వివాహా వేడుక కన్నులవిందుగా జరిగింది. ఈ ఉదయం జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల, సుహాసిని, రాధిక, శరత్ కుమార్, రేవతి, మేనక తదితరులు హాజరయ్యారు.

radha daughter karthika nai

కార్తీక వివాహం తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. కేరళ సంప్రదాయాల ప్రకారం కార్తీక-రోహిత్ మీనన్ ల వివాహం నిర్వహించారు. కార్తీక కూడా తల్లి రాధ బాటలోనే పలు సినిమాల్లో నటించారు. 2009లో నాగచైతన్య సరసన జోష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

radha daughter karthika 1

ఆ తరువాత జీవాతో కలిసి రంగం సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ తో దమ్ము, అల్లరి నరేశ్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లోనూ నటించిన కార్తీక 2015 తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదు. ఆమె వ్యాపార రంగంలో ప్రవేశించినట్టు తెలుస్తోంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu