ఈ వారం మూడు సినిమాల సంగతేంటి..?

బాహుబలి 2 దెబ్బకు సినిమాలు విడుదలకు భయపడుతున్నాయి. బాహుబలి క్రేజ్ లో ఎక్కడ కొట్టుకుఓపోతామో అని సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతున్నాయి. గతవారం కూడా ‘బాబు బాగా బిజీ’ సినిమా మాత్రమే వచ్చింది. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ వారం మాత్రం మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. అవే రాధ, వెంకటాపురం, రక్షకభటుడు.
శర్వానంద్ నటించిన ‘రాధ’ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్లు, పాటలతో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. అసలే శర్వా మాంచి ఫామ్ లో ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తనవైపు తిప్పుకున్నాడు. దీన్ని బట్టి రాధ సినిమాకు మంచి  ఓపెనింగ్స్ రావడం ఖాయం. సినిమాలో కామెడీ బాగా వర్కవుట్ అయిందట. లాజిక్స్ పట్టించుకోకుండా సినిమా చూస్తే గనుక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని సమాచారం. మరి ఈ సినిమాకు బాహుబలి ఫ్యాక్టర్ ఏమైనా.. అడ్డుపడుతుందేమో చూడాలి. 
ఇక వెంకటాపురం సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంది. థ్రిల్లర్ నేపధ్యంలో నడిచే ఈ కథపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లో గా ఉందని, సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉందని ఇన్సైడ్ టాక్. థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే ఆడియన్స్ కు మాత్రం ఈ కనెక్ట్ అవుతుందని అంటున్నారు. సో.. కాస్తో.. కూస్తో ఈ సినిమా కూడా నిలదొక్కుకునే ఛాన్సులు ఉన్నాయి. 
ఇక రక్షకభటుడు చిత్రబృందం మా సినిమాలో హనుమంతుడు ఎవరో చెప్పుకోండి అంటూ ఓ ప్రశ్న వదిలారు. ఆ పాత్రను దాచిపెట్టి పెద్ద సాహసం చేస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రశ్నతో సినిమాపై కాస్త ఫోకస్ పెరిగింది. ఈ పాత్ర ఏమైనా వర్కవుట్ అయితే గనుక నిర్మాతలు సేఫ్ లో పడతారు. వంశీ కృష్ణ కూడా రక్ష, జక్కన్న తరువాత ఓ మంచి హిట్ సినిమా తీయాలని కామెడీతో కూడిన థ్రిల్లర్ కథను ఎన్నుకున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి!